అందుకే మహేష్ బాబు అంటే విపరీతమైన పిచ్చి.. పరశురాం..!

-

తెలుగు ఇండస్ట్రీ తప్ప మరే ఇండస్ట్రీ తనకు సెట్ అవ్వదు అని నమ్మే హీరోలలో మొదటి వరుసలో ఉంటారు మహేష్ బాబు. అంతే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీ అంటే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు.అందుకేనేమో తన సినిమాలు కమర్షియల్ పరంగా విజయాలను సాధిస్తున్నా.. తన వెనుక వచ్చిన కుర్ర హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్ లు గా మారుతున్నా.. తన తండ్రి హిందీ లో నటించాలని చెప్పినా.. ఆ కోరికను కూడా పక్కకు నెట్టి కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తన సినిమాలను సొంతం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబుకు తెలుగు పరిశ్రమ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా మహేష్ బాబు కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా అని చెప్పవచ్చు ఎంతో మంది పిల్లల ప్రాణాలను కాపాడిన దేవుడు అని చెప్పవచ్చు . ఇక ఇలాంటి మహేష్ బాబుపై తాజాగా పరశురామ్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారుతున్నాయి.గతంలో మహేష్ బాబు పరశురామ్ మధ్య విభేదాలు ఉన్నాయని.. ఇక సర్కారు వారి పాట సినిమా విషయంలో మహేష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు అని కామెంట్లు బాగా వ్యక్తమయ్యాయి. ఇక పరశురామ్ సినిమాలో హీరో లేకుండా ఒక్క సీన్ ను కూడా రాసుకో లేదని.. ఇలా చేయడం మహేష్ కి మరింత కోపం తెప్పించింది అని ప్రచారం జరిగింది. ఒక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరశురామ్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు తనపై చిరాకు పడడం వాస్తవమే.. ఇక పెద్ద సినిమాలు చేసే సమయంలో కచ్చితంగా ఎవరైనా ఇలా చిరాకు పడతారు. సర్కారు వారి పాట షూటింగ్ మొదలైన తర్వాత మూడు దశల కరోనా వచ్చింది. ఇక మహేష్ బాబు ఒకే స్క్రిప్ట్ మూడు సంవత్సరాలపాటు మోయడం అనేది ప్రశంసనీయం అని ఆయన వెల్లడించాడు.

ఒక స్క్రిప్ట్ ను అంతకాలం మోయడం కష్టమైన పని.. ఒత్తిడిలో గొడవలు జరిగినా.. మహేష్ బాబు మాత్రం తన సోదరుడిలా తనను చూసుకున్నారు అని పరుశురామ్ వెల్లడించారు. కరోనా రావడం , ఆ తర్వాత తన సోదరుడు మరణించడం, ఆయన తన కాలు సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడం ఇలాంటి ఎన్నో బాధాకరమైన విషయాలు ఎదురైనప్పటికీ.. నన్ను మాత్రం సొంత సోదరుడు లాగా మహేష్ బాబు చూసుకున్నాడు. మహేష్ బాబు… ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇస్తారు.. ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవాలని చెబుతారు అందుకే ఆయన ఇంత సక్సెస్ అవుతున్నారు అని పరుశురామ్ వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version