ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్ బుక్ అంతరాయానికి ఆ నెక్లెస్ కారణమట!

-

వరల్డ్ వైడ్ గా ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్ బుక్ సేవలు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపమే దీనికి కారణమని మెటా స్పష్టం చేసింది. అయితే అసలు కారణం ఇదేనంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ‘ ఫేస్ బుక్, ఇన్స్టాలో నీతా అంబానీ ధరించిన ₹500cr నెక్లెస్ పైనే చర్చ జరుగుతోంది. అది తన భార్య చూస్తే తనకు కూడా నెక్లెస్ కొనిపెట్టమంటుందని జుకర్బర్గ్ ఆందోళనకు గురయ్యారు.అందుకే fb,insta యాప్స్ నిలిపేశారు’ అని రాసుకొచ్చారు.

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ,అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా వరుడి తల్లి నీతా అంబానీ ఈ 500 కోట్ల రూపాయల విలువైన పచ్చ-డైమండ్ నెక్లెస్‌ను ధరించారు . ఇది నెక్లెస్ యొక్క ఊహాజనిత విలువ. అసలు విలువ ఎంత అనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఇది కనీసం రూ. 400 కోట్లు కావచ్చు అని అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version