తండ్రి అయిన హీరో శర్వానంద్.. కూతురు పేరు ఏమిటి అంటే..?

-

హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక గత సంవత్సరం  జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది.వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. గత కొన్నిరోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం ప్రెగ్నంట్ అని చెప్పుకొస్తున్నారు. టెక్కీగా వర్క్ చేస్తోన్న రక్షిత  పెళ్లి తరువాత తన వర్క్ కోసం అక్కడికి వెళ్ళింది. సినిమాలు షూటింగ్ ఉండడం వలన శర్వా ఇక్కడే ఉండిపోయాడని చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయమై ఇప్పటివరకు స్పందించని శర్వానంద్.. నేడు తన పుట్టినరోజున తాను తండ్రి అయ్యినట్లు అధికారికంగా ప్రకటించారు. రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని , తన కూతురు పేరు లీలా దేవి మైనేని అంటూ రివీల్ చేశాడు. దీంతో పాటు శర్వా, రక్షిత.. లీలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా  లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో లో వైరల్ గా మారాయి. పుట్టినరోజున.. తన కూతురు పుట్టిందని చెప్పడం చాలా బావుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొంతమంది.. ఈ కాలంలో కూడా అచ్చతెలుగు పేరు పెట్టడం బావుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version