అది నాకు నేను వేసుకున్న శిక్ష: విజయ్ దేవరకొండ

-

విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘లైగర్’. విడుదలకు ముందే దాని కలెక్షన్ల గురించి విజయ్ చాలా గొప్పగా చెప్పారు. తీరా విడుదల అయిన అనంతరం మూవీ బాక్సాఫీస్ వద్ద వారి డిజాస్టర్లు మూట కట్టుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో ఇకపై మాత్రం అలా మాట్లాడనని విజయ్ తెలిపారు. ఆ సినిమా చెప్పిన పాఠం తర్వాత విడుదలకు ముందే సినిమా గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని, ఇది తనకు తానే విధించుకున్న శిక్ష అని ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తెలిపారు.

కాగా, పరశురాం దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version