సత్య శ్రీ ను అందుకే నా స్కిట్ లో పెట్టుకున్నాను : చమ్మక్ చంద్ర

-

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో గతంలో నాగబాబుతో సహా చమ్మక్ చంద్ర కూడా షో నుంచి అవుట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చమ్మక్ చంద్ర జీ తెలుగులో వస్తున్న అదిరింది షో లో కూడా పంచ్ డైలాగులతో కామెడీ పండిస్తున్నాడు. తాజాగా చమ్మక్ చంద్ర ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అక్కడ మీ టీం లో లేడి ఉంది కదా ఆమె గురించి చెప్పండి అని ప్రశ్నించడం జరిగింది.. ఇక ఈ విషయంపై చమ్మక్ చంద్ర ఏం సమాధానం ఇచ్చాడు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

చమ్మక్ చంద్ర మాట్లాడుతూ నేను చేసే స్కిట్ లో నాతోపాటు చేసే లీడ్ పెయిర్ చాలా ఇంపార్టెంట్ అప్పటిదాకా వినోద్ నాతోపాటు చేసేవాడు. ఇక మా ఇద్దరి కాంబినేషన్ కూడా మంచి సక్సెస్ అయింది. ఒకసారి వినోద్ కి హౌస్ ఓనర్ తో గొడవ జరగడం ఆ ఘటనలో వినోద్ గాయపడడం కారణంగా వినోద్ ఆరోగ్యం సరిగా లేక షో చేయలేకపోయాడు. నా స్కిట్ లు బాగా పండాలి అంటే లీడ్ పెయిర్ చాలా అవసరం. ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకుంటే మళ్లీ ఆ అమ్మాయి ప్రేక్షకులకు అలవాటు పడడానికి కనీసం 15 ఎపిసోడ్ ల పైన పడుతుంది కాబట్టి సత్య అనే అమ్మాయిని మళ్లీ తీసుకోవాల్సి వచ్చింది అని చమ్మక్ చంద్ర తెలిపాడు.

సత్య శ్రీ అనే అమ్మాయి ఇదివరకే నాతో 3 ఎపిసోడ్లు చేసింది ఇక ఆమె పండించే కామెడీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది కాబట్టి జబర్దస్త్ తర్వాత కూడా ఆమె పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తర్వాత మీరు నటించిన సినిమాలలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏమిటి అని యాంకర్ చమ్మక్ చంద్ర ని అడగగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ – సమంత జంటగా వచ్చిన అ ఆ సినిమా అంటే చాలా ఇష్టమని, ఆ సినిమాలో తన పాత్ర కూడా చిన్నదైనా మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని చమ్మక్ చంద్ర తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version