టీటీడీ ఆస్తులు అమ్మే సమస్యే లేదు… కేసు కొట్టేసిన ఏపీ హైకోర్ట్

-

టీటీడీ ఆస్తులను విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది. ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేసాయి. ఇక తాజాగా దీనిపై హైకోర్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ ఆస్తుల పై దాఖలైన పిటీషన్‌ను హైకోర్ట్ పరిష్కరించింది. ఆస్తుల పరిరక్షణకు టీటీడీ తీసుకున్న చర్యల పై గతంలో కోర్టులో న్యాయవాది యలమంజుల బాలాజీ పిటీషన్ దాఖలు చేసారు.

టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం గతంలో నియమించిన కమిటీని మార్చి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ మార్చి 9న జీఓ జారీ చేశామని టీటీడీ కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళింది. పదవీ విరమణ చేసిన యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ కె.శ్రీధర్‌ రావు, మాజీ న్యాయమూర్తి ఎం.సీతారామ మూర్తి నేతృత్వంలో 9 మంది సభ్యులతో కమిటీని నియమించామని టీటీడీ కోర్ట్ కి వివరించింది.

బంగారు ఆభరణాలు, నగదు వివరాలను కూడా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని కోరిన న్యాయవాది బాలాజీ అప్పీల్ ని టీటీడీ తప్పుబట్టింది. ఇలా చేస్తే భద్రతా సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్న టీటీడీ… బంగారు నగల పై ఇప్పటికే జగన్నాధరావు కమిటీ ఇచ్చిన సిఫారస్‌లను అమలు చేస్తున్నామని స్పష్టత ఇచ్చింది. టీటీడీకి దాతలు ఇచ్చిన భూములను భవిష్యత్తులో అమ్మబోమని కూడా హైకోర్టుకు టీటీడీ చెప్పగా ఈ పిటీషన్‌ను డిస్పోజ్‌ చేసింది కోర్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version