త‌ల్లి పాలతో ఎన్ని లాభాలో…

-

ప్రతి శిశువుకు ప్రకృతి అందించే అమూల్య సంపద తల్లిపాలు. బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానం. ప్రేమానురాగాలతో బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే జీవితాంతం ఆరోగ్యంగా మనుగడ సాగిస్తారు. తల్లిపాలు శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

త‌ల్లుల‌కి ఉప‌యోగాలు:
– బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోజుకు దాదాపు 500 క్యాల‌రీలు అదనంగా ఖర్చు అవుతుంది. తద్వారా గ‌ర్భ‌ధారణ సమయంలో పొందిన బరువును తగ్గించుకొనుటకు సహాయపడుతుంది.

– ఎవ‌రైతే స్త్రీలు శిశువుకు త‌ల్లిపాటు ఇస్తారో వారిలో రొమ్ము క్యాన్స‌ర్ మ‌రియు అండాశ‌య క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటుంది.

– త‌ల్లిపాలు ఇవ్వ‌డం ద్వారా ఆక్సీటాక్సిన్‌లు విడుద‌ల‌వుతాయి. అవి గ‌ర్భాశ‌యాని సంకోచింప చేసి ప్ర‌స‌వానంత‌ర‌ము క‌లిగే ర‌క్త‌స్రావాన్ని త‌గ్గిస్తాయి.

– బిడ్డ‌కు త‌ల్లిపాలు ఇచ్చే స్త్రీల‌లో మ‌ధుమేమం, ర‌క్త‌పోటు మ‌రియు హృడ్రోగాలు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

బిడ్డ‌ల‌కి ఉప‌యోగాలు:
– త‌ల్లిపాల‌లో పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు మ‌రియు పోష‌ణ‌కు కావాల‌సిన కొవ్వు, నీరు, చెక్కెర‌, ప్రోటీనులు మ‌రియు మిన‌ర‌ల్స్ స‌మ‌పాల‌లో ఉంటాయి.

– త‌ల్లిపాలు పొందుతున్న పిల్ల‌ల‌లో ఆక‌స్మిక శిశుమ‌ర‌ణాల స‌మ‌స్య త‌క్కువ‌గా ఉంటుంది.

– త‌ల్లిపాలు రోగ‌నిరోధ‌కాల‌ను క‌లిగి ఉండ‌డం ద్వారా, పిల్ల‌ల‌లో చెవి సంబంధిత అంటురోగాలు, అతిసార మ‌రియు శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

– త‌ల్లిపాలు సులువుగా జీర్ణ‌మ‌వుతాయి. మ‌రియు త‌ల్లిపాలు పొందుతున్న పిల్ల‌ల‌లో గ్యాస్‌, ఆహార పోష‌ణ స‌మ‌స్య‌లు, మ‌ల‌బ‌ద్ధ‌క స‌మ‌స్య‌లు త‌క్కువ‌గా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version