OG గ్లింప్స్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓ జి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదని చెప్పాలి. ఇకపోతే షూటింగ్ అప్డేట్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి విషయంపై కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు కిక్కిచ్చే వార్తలను మేకర్స్ రిలీజ్ చేస్తూనే వస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి. ఆయన ఓజీ చిత్రంలో విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు ఒక నెటిజన్ ఓజీ మూవీ అప్డేట్ గురించి అడిగాడు. మిమ్మల్ని ఓజీ చిత్రంలో చూసేందుకు ఎదురుచూస్తున్నా ము. ఈ మూవీలో మీ రోల్ గురించి కొంచెం చెప్పండి అంటూ అడగగా దానికి ఆయన రిప్లై ఇస్తూ….ఇప్పుడు నా పాత్ర గురించి చెప్పలేను కానీ, త్వరలో గ్లింప్స్ రిలీజ్ కానుందని వెల్లడించారు.సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version