బాలుడు తరగతిలో నిద్రపోయిన విషయం మరిచి స్కూల్ టీచర్ తాళం వేసి వెళ్లిపోయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని లింగాల మండలం శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో సమయం అయిపోగానే విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్లిపోగా ఉపాధ్యాయులు గదులకు తాళాలు వేసి వెళ్లిపోయారు.
అయితే, ఒకటో తరగతి విద్యార్థి శరత్ నిద్రపోవడంతో గదిలోనే ఉండిపోయాడు. సాయంత్రం 3:30 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. 4 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి మల్లేష్ పాఠశాలకు వెళ్లి వెతికాడు. ఈ క్రమంలో ఓ తరగతి గది కిటికి తెరచి చూడగా శరత్ నిద్రించి కనిపించగా..వెంటనే గది తాళం పగులగొట్టి కుమారుడిని బయటకు తీసుకువచ్చాడు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.