కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ తరునంలోనే… ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తొలి రోజు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
శుక్రవారం(జనవరి 31) ఆర్థిక సర్వే, శనివారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. సోమవారం(ఫిబ్రవరి 3) రాష్ట్రపతి ప్రసంగంపై ఉభయసభలు చర్చ ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.
- ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- తొలి రోజు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- శుక్రవారం(జనవరి 31) ఆర్థిక సర్వే,
- శనివారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- సోమవారం(ఫిబ్రవరి 3) రాష్ట్రపతి ప్రసంగంపై ఉభయసభలు చర్చ