వేగంగా వచ్చి బస్సు ఢీకొట్టినా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపట్టాడు. ఓ వ్యక్తి వెనుక ముందు చూసుకోకుండా హోటల్ నుంచి రోడ్డు మీదకు పరిగెత్తాడు. వెంటనే బస్సు డ్రైవర్ హారన్ కొట్టడంతో ఒక్కసారిగా భయపడిపోయి రోడ్డు మీదనే ఆగిపోయాడు.
అప్పటికే వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో అంత దూరంలో ఎగిరిపడ్డాడు.వెంటనే బస్సు డ్రైవర్ బ్రేకులు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు వచ్చి కిందపడిపోయిన వ్యక్తిని లేపారు. అప్పటికీ ఆ వ్యక్తి బతికే ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన
తమిళనాడులోని కన్యాకుమారిలో ఆలస్యంగా వెలుగుచూసింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు చిన్న గాయాలతో ఆ వ్యక్తి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
బస్సు ఢీ కొట్టినా బతికిన వ్యక్తి..
తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ వ్యక్తి రోడ్డుపై వాహనాల రాకపోకలు గమనించకుండా దాటడంతో వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో అతను గాల్లోకి ఎగిరిపడ్డాడు. అయితే, ఇంత ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో వైరలవుతుంది. pic.twitter.com/H8P6l9IoS4
— ChotaNews App (@ChotaNewsApp) February 6, 2025