జిహెచ్ఎంసి అభ్యర్థులకు ఎన్ని కష్టాలో.. 15 లక్షల మంది రప్పిస్తున్నారు..!

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రకటించడంతో గెలుపే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓవైపు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూనే గెలిచేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తూ వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నగరానికి 15 లక్షల మందిని రప్పిస్తున్నారు అన్నది ప్రస్తుతం అందుతున్న సమాచారం. నగరంలో ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హైదరాబాద్లో స్థిరపడిన వారు దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం వివిధ కారణాలతో అందరూ కూడా తమ సొంత ర్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పదిహేను లక్షల మంది ప్రస్తుతం రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో దాదాపు ఎక్కువమంది ఓట్లు కలిగి ఉన్నట్లు సమాచారం. అందుకే వీరి ఓట్లు కూడా క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version