వైరల్: కావాలనే బైక్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్.. మరీ ఇంత దారుణమా..?

-

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్కార్పియో డ్రైవర్ బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని కావాలనే ఢీ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను అనురాగ్ లైయర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. అలాగే ఈ వీడియోను పీఎంఓ, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, డీసీపీకి ట్యాగ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

అనురాగ్ లైయర్ ట్విట్టర్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘మమ్మల్నీ కాపాడండి. స్కార్పియో డ్రైవర్ కోపంతో ఐదుగురు బైక్ రైడర్లను కారుతో ఢీ కొట్టడానికి ప్రయత్నించాడు. ఒక రైడర్ వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. రైడర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇలాంటి వాళ్లను ప్రభుత్వం ఎందుకు శిక్షించడం లేదు. మేం అన్ని ట్యాక్సులు కడుతున్నాము. మంచి ప్రభుత్వం కోసం మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేదు. అదృష్టవశాత్తు ఏ రైడర్‌కు పెద్దగా గాయాలు కాలేవు. ఆ స్కార్పియో డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.’’ అని ఆయన పేర్కొన్నారు.

అయితే వీడియోను ఒక్కసారి చూసినట్లయితే.. బైక్ రైడర్లకు, కారు డ్రైవర్ మధ్య వాగ్వాదం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దీంతో గొడవెందుకుని రైడర్ ముందుకు వెళ్లిపోతాడు. కొద్ది సేపట్లో స్కార్పియో డ్రైవర్ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొని వెళ్లిపోతాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version