బీఆర్ఎస్ అధినేత ,మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.పదేళ్లు కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు. చివరకు ఏమైంది నడుం ఇరిగి మూలకు పడ్డాడు అని అన్నారు.హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కారు కరాబు అయి కార్ఖానాకు పోయింది. మూలకుపడింది. కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడు.
తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సు యాత్ర ఉంది అని విమర్శించారు.బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, కరీంనగర్,మల్కాజ్ గిరి లాంటి సీట్లలో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. నల్గొండ, మెదక్ లాంటి సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నది బీజేపీ ప్రయత్నం అని అన్నారు. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వం. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చి అవతలపారేస్తం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.