మిషన్ భగీరథ పథకంపై మరోసారి కేంద్రం ప్రశంసలు

-

తెలంగాణ సర్కార్‌ చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఛత్తీస్గఢ్ లో పర్యటనలో మరోసారి మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించారు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్. దేశంలో వంద శాతం న‌ల్లా క‌నెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని..తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి అభినందించారు.

దేశంలో ప్రతి ఇంటింటికీ న‌ల్లాల ద్వారా నీటిని ఇవ్వాల‌నే ల‌క్ష్యానికి చేరువ అయ్యామ‌ని కేంద్ర మంత్రి ప్రక‌టించారు. దేశం లో ప్రతి ఇంటికీ మంచినీరు అనే విజ‌న్ త్వర‌లోనే నిజం కాబోతుంద‌ని ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ త‌ర‌హాలోనే వంద శాతం న‌ల్లా క‌నెక్షన్లు ఇచ్చింది గోవా రాష్ట్రం. త‌ర్వాత స్థానాల్లో పాండిచ్చేరి (87. 32%), హ‌రియాణ (85.11%), అండ‌మాన్ నికోబార్ దీవులు (83.76%) ఆరో స్థానంలో గుజ‌రాత్ (81.63%) రాష్ట్రం ఉంది.  కాగా.. 2015 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version