దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ని రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయాన్ని 18 వ అంతస్తులో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత మ్యూజియం ని కూడా ప్రారంభిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావించారని.. వారి ఆలోచనల మేరకు అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపకల్పన జరిగిందన్నారు సిపి.
ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని డిపార్ట్మెంట్ లకు సంబంధించిన అధికారులను సమన్వయపరచడమేనని అన్నారు. ఇప్పటికే ఈ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ కు పేరు ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే. ట్విన్ టవర్స్‌గా పిలుస్తున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌కు తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TSICCC)గా నామకరణం చేశారు అధికారులు. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు.