గ్రూప్-3 అభ్యర్థిని ప్రభుత్వ వాహనంలో సెంటర్ వద్ద దిగబెట్టిన సీఐ

-

తెలంగాణలో గ్రూప్-3 పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే, ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులను గేటు వద్దనే అధికారులు ఆపేశారు. దీంతో సెంటర్ల వద్ద కాస్త గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే పరీక్ష సెంటర్‌కు వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని ఇబ్బంది పడుతున్న ఓ అభ్యర్థురాలికి సీఐ సాయం చేశారు.

విధుల్లోనే కాదు మానవత్వంలోనూ మేము ముందుంటామని నిరూపించారు. గ్రూప్-3 పరీక్షలు రాయడానికి జీడిమెట్లలోని గౌతమి కాలేజీకు వచ్చిన విద్యార్థిని.. తన ఎగ్జామ్స్ సెంటర్ బాలానగర్‌లోని గీతాంజలి కళాశాల అని తెలుసుకుని ఇబ్బంది పడింది.టైం తక్కువగా ఉండటంతో అక్కడకు ఎలా వెళ్లాలని టెన్షన్ పడుతుండగా అక్కడే ఉన్న జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ తమ పాట్రోలింగ్ వాహనంలో విద్యార్థినిని తీసుకెళ్లి సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చారు.పోలీసుల సహాయానికి పలువురు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version