ఎమ్మెల్సీ అనంత బాబుకు మరోసారి రిమాండ్ పొడిగించిన కోర్టు

-

తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఉరఫ్ అనంత బాబుకు రాజమండ్రి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. డ్రైవర్ హత్య కేసులో అనంత బాబుకు రిమాండ్ పొడిగిస్తూ శుక్రవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26వ తేదీ వరకు ఎమ్మెల్సీ అనంత బాబుకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు రాజమండ్రి కోర్టు పేర్కొంది.

దీంతో ఆగస్టు 26 వరకు అనంతబాబు జైల్లోనేే ఉండనున్నారు. కాగా ఎమ్మెల్సీ అనంత బాబుకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో ఎన్నిసార్లు పిటిషన్లు దాఖలు చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. ఎమ్మెల్సీ కి వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉండడంతో అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. దీంతో ఇటీవలే రాజమండ్రి కోర్టు మరో 14 రోజులపాటు రిమాండ్ పొడిగించింది. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version