అన్నయ్య రుణం తీర్చుకుంటానంటున్న కార్తీ..!!

-

ప్రముఖ కోలీవుడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఆవారా, ఖైదీ, చినబాబు లాంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈయన మరెన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తాను అంటూ ఎప్పటికప్పుడు పలు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు. ఇకపోతే ఈయన అన్నయ్య ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అలాగే నేషనల్ అవార్డు విజేత సూర్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషలో సూర్య ఒక క్రేజీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కార్తీ కూడా అన్నయ్య బాటలో పయనిస్తూ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకోవడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే కార్తీ తాజాగా నటించిన చిత్రం వీరుమాన్.. ఈ సినిమా ఈరోజు తమిళంలో చాలా గ్రాండ్ గా విడుదలయ్యింది.మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని కార్తీ సోదరుడు సూర్య నిర్మాతగా నిర్మించారు. ఇక తన తమ్ముడి సినిమాను నిర్మించడం సూర్యకి ఇది రెండవసారి. మూడేళ్ల క్రితం వచ్చిన చినబాబు చిత్రాన్ని కూడా సూర్య నిర్మించడం జరిగింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ తన అన్నయ్య పై ఎమోషనల్ కామెంట్లు చేశారు. తన అన్నయ్య రాముడు అని, లక్ష్మణుడిలా ఎప్పుడు తాను తను అన్నయ్య వెంటే ఉంటానని కార్తి వెల్లడించారు. అన్నయ్య తో వుంటే ధైర్యంగా ఉంటుంది అని.. అందుకే నా వెనుక తమ్ముడు ఉన్నాడు అని అన్నయ్య కూడా ధీమాగా ఉంటారు అని తెలిపారు కార్తీ..

ఇక మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అన్నయ్య కోసం ఒక కథ రాసుకున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు కార్తీ. ఇక త్వరలోనే సూర్య ని డైరెక్ట్ చేసే విషయంలో కార్తీ హింట్ ఇచ్చాడు అంటూ తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే కార్తీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించబోతున్నట్లు అలా చేసి తన అన్నయ్య రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కార్తీ.. ఇక ఇదే కనుక జరిగితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక మోస్ట్ కేజీ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version