ఏపీలోని అనకాపల్లి జిల్లా కశీంకోట మండలంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళను ఎవరో చంపేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసం దుప్పటిలో చుట్టారు. అనంతరం దానిని బయ్యవరం కల్వర్టులో పడేవేసినట్లు తెలిసింది.
అయితే, కల్వర్టులోని ముటను గుర్తించిన స్థానికులు అదేంటా అని తెరిచి చూడగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మృతిచెందిన మహిళ ఎవరు? ఎవరు ఇంత దారుణంగా చంపి ఉంటారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.