టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రమ్యకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కెరియర్ తొలినాళ్లల్లో ఐరన్ లెగ్గుగా ముద్ర తెచ్చుకొని..ఆ తర్వాత రాఘవేంద్రరావు పుణ్యమా అని ఎంతో మంది స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఒక సినిమాలో రమ్యకృష్ణ నటిస్తోందంటే చాలు కచ్చితంగా ఆ సినిమా కలెక్షన్ సాధిస్తుందని నిర్మాతలు గుండెలపై చేయి వేసుకొని నిద్రపోయేవారు. ఇక అంతలా మంచి పాపులారిటీని సంపాదించుకున్న రమ్యకృష్ణ లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా అదరగొట్టింది. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు ఓవర్ నైట్ లోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె బాహుబలి సినిమాతో శివగామిగా రాజ్యాన్ని ఏలింది. ఇక చెప్పుకుంటూ పోతే రమ్యకృష్ణ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక అందుకే ఈమె డిమాండ్ కి తగ్గట్టుగా ఒక్కరోజుకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి రమ్యకృష్ణకు అవకాశాలు ఇస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే రమ్యకృష్ణ భర్త కృష్ణ వంశీ గురించి కూడా తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆయన తమిళ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు అయినప్పటికీ తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ఒక స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణ నటించిన కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇక వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇకపోతే గత కొంతకాలంగా రమ్యకృష్ణ , కృష్ణవంశీ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై దర్శకుడు కృష్ణవంశీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కృష్ణవంశీ డైరెక్షన్లో రమ్యకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ . ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న కృష్ణవంశీ ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు.
ఇకపోతే ఆయన తన వ్యక్తిగత విషయం గురించి మాట్లాడుతూ లక్షల్లో ఒకరు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారని ఇండస్ట్రీలో కచ్చితంగా కష్టాలు ఉంటాయని తన తండ్రి చెప్పినట్లు కృష్ణవంశీ తెలిపారు. ఇక అందుకే బాధ్యత అనే బందీలో ఉండకూడదని భావించి పెళ్లి వద్దని అనుకున్నానని కృష్ణవంశీ తెలిపారు. ఆ తర్వాత రమ్యకృష్ణ పెళ్లి చేసుకుందని, ఇక పెళ్లికి రమ్యకృష్ణ ఎలాంటి హద్దులు కూడా పెట్టలేదని తెలిపారు. రమ్యకృష్ణకు నాకు విభేదాలు వచ్చాయని జరిగిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు అని ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది.