రూ.లక్ష యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లిన కుక్క!

-

పెంపుడు కుక్క విశ్వాసం గా ఉంటూ యజమాని ఏదైనా పారేసుకుంటే తెచ్చి ఇస్తుంది.కానీ ఓ పెంపుడు కుక్క మాత్రం యజమానికి తేరుకోలేని ఝలక్ ఇచ్చింది.అతను నగదును దాచుకున్న సంచిని ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసింది.ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నాచినపల్లి గ్రామానికి చెందిన కాసు చేరాలు అనే గొర్రెల కాపరి మందకు రక్షణగా ఉండడానికి ఓ కుక్క ని పెంచుకున్నాడు.ఆయన సంపాదించిన డబ్బును ప్రత్యేకంగా కుట్టించుకున్న జోలె సంచిలో దాచుకుంటాడు.ఈనెల 25న రాత్రి నడుముకు ఉన్న సంచి తీసి మంచంలో పెట్టి స్నానానికి వెళ్లాడు. ఇంతలో పెంపుడు కుక్క ఆ సంచిని నోట కరచుకునివెళ్లి ఎక్కడో పడేసింది.

అది తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు గమనించినా, ఏదోలే అని పట్టించుకోలేదు.బయటికి వచ్చిన చేరాలుకు మంచంపై బ్యాగ్ కనిపించకపోవడంతో వెతకడం మొదలుపెట్టాడు.కుక్క ఏదో పట్టుకొని పోవడం చూశామని కుటుంబ సభ్యులు చెప్పారు.అయితే అది డబ్బు సంచి అని, అందులో రూ.లక్షనర నగదు ఉన్నాయని చెప్పడంతో షాక్ కి గురయ్యారు.అయితే గంట వ్యవధిలో కుక్క తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఎక్కడో పడేసి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.రెండు రోజులపాటు వెతికినా దొరకలేదు.గ్రామపంచాయతీ వారు చాటింపు వేయించిన ఫలితం కనిపించలేదు.దీంతో ఎవరికైనా దొరికితే తనకు అప్పగించాలని బాధితుడు వాట్సాప్ గ్రూపు లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version