తొలిదశ వ్యాక్సిన్ వాళ్ళకే.. ప్రస్తుతం చేసిన కేంద్రం..?

-

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న తరుణంలో దేశ ప్రజానీకం మొత్తం కరోనా వైరస్ ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలో భారత్ బయోటెక్ అనే ఫార్మా సంస్థ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అందరి ఆశలు ఆ వ్యాక్సిన్ పైనే ఉన్నాయి

అయితే కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలిదశ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత తొలి దశ వ్యాక్సిన్ ఆరోగ్య కార్యకర్తలు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అంటూ కేంద్రం స్పష్టం చేసింది. తొలి దశలో భాగంగా దేశ జనాభాలో ఏకంగా 23 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version