మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ జగిత్యాల రైతులు ఆందోళనలు ఉదృతం చేశారు. భూములు కాపాడుకోవడం కోసం పండుగ రోజు సైతం రోడ్డెక్కారు అన్నదాతలు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల – నిజామాబాద్ రహదారిపై ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకి దిగారు.
ఇండస్ట్రియల్ జోన్ నుంచి తమ భూములను కాపాడాలని నినాదాలు చేశారు. రోడ్డుపై దారి నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులకి రైతులకి మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. మరోవైపు మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు సర్పంచులు మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే రాజీనామాకు సైతం సిద్ధమని అధికార పార్టీ సర్పంచులు హెచ్చరిస్తున్నారు.