థాయ్‌లాండ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సెఫ్టీ అధికారులు నైట్‌క్లబ్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
బ్యాంకాక్‌కు దక్షిణాన 150 దూరంలో ఉన్న సట్టహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్‌స్పాట్ నైట్ క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్లబ్ మొత్తాన్ని వేగంగా మంటలు వ్యాపించడంతో అక్కడికక్కడే 13 మంది మరణించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మంటలు చెలరేగుతున్న క్రమంలో నైట్ క్లబ్‌కి వచ్చిన కొందరు భయంతో బయటికి పరిగెత్తారు. అయితే నైట్‌క్లబ్‌లోని గోడలకు ఉన్న కెమికల్స్ వల్ల మంటల తీవ్రత ఎక్కువైందని, అందుకే మంటలు ఆర్పేందుకు ఎక్కువ సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు.