పృథ్విరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ మూవీ పోస్టర్ అవుట్..!

-

మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ది గోట్ లైఫ్ ఆడు జీవితం కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జిన్ లూయిస్, అమలాపాల్, కె.ఆర్ గోకుల్ ఈ సినిమాలో నటిస్తున్నారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ది గోట్ లైఫ్ బిగినింగ్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మూవీని బెన్యా మీన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా తీసుకువస్తున్నారు. ఈ సినిమాని అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బ్లేస్సి రూపొందిస్తున్నారు విజువల్ రొమాన్స్ బ్యానర్ ది గోట్ లైఫ్ సినిమాని మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద ప్రాజెక్టుగా భారీ బడ్జెట్ తో నిర్మించింది.

ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మలయాళం తో పాటుగా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా నుండి రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్, రన్వీర్ సింగ్ రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు ఈ సినిమా నుండి పోస్టర్ ని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version