వీడియో: భీకర దృశ్యం.. బీభత్సం సృష్టించిన సుడిగాలి

-

దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరంలో ఆదివారం సుడిగాలి బీభత్సం సృష్టించింది. దీంతో ఆ నగరం అంతా అతలాకుతలం అయింది. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 7.20 గంటలకు వేగవంతమైన గాలులు వీచాయి. ఈ సుడిగాలి వల్ల చెట్లన్ని నేలకూలాయి. ఇళ్లపైన ఉండే పెంకులు, వాహనాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. విద్యుత్ లైన్లు కూలడంతో పలు చోట్లా ఆకస్మికంగా మంటలు కూడా చెలరేగాయి.

సుడిగాలి-బీభత్సం

వీటికి సంబంధించిన వీడియోలను మాటేస్ సోబిరాజ్, ఇరిక్ వాంగ్ అనే వ్యక్తులు తమ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఒక్కసారిగా చూసినట్లు అయితే.. ఫోషాన్ నగరం మొత్తాన్ని దుమ్ము, ధూళి కప్పేసినట్లు అనిపిస్తుంది. సుడిగాలి వేగంగా వీయడంతో తక్కువ బరువున్న సామన్లు సైతం గాల్లో ఎగురుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ సుడిగాలి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. కానీ చాలా మంది ప్రజలకు ఆస్తి నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version