20 ఏళ్లకే సహజీవనం చేసి మోసపోయానంటున్న హీరోయిన్..!!

-

సినీ ప్రముఖుల జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో అంతే చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా హీరోయిన్స్ పైన పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బాడీ షేమింగ్ పైన, తాము వేసుకునే దుస్తులపైన ఇలా పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. మరి కొంతమంది కెరియర్ ప్రారంభంలోని సహజీవనం, లవ్ అనే విషయాలలో మోసపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా ఎంతోమంది శారీరకంగా ఒక్కటయ్యి.. కొన్ని కారణాల చేత ప్రేమించుకుని విడిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఆండ్రియా కెరియర్ లో జరిగిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను కూడా 20 ఏళ్ల వయసులోనే ఒకరితో సహజీవనం చేసి మోసపోయానని తెలియజేస్తుంది. తమిళంలో స్టార్ హీరోయిన్గా, స్టార్ సింగర్ గా కూడా ఎన్నో చిత్రాలలో పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒకరితో బాగా సహజీవనం చేశానని కొంతకాలం తర్వాత దారుణంగా మోసపోయినట్లు తెలుసుకున్నానని తెలియజేస్తోంది ఆండ్రియా.

అయితే ఆండ్రియా ఎవరి చేతిలో మోసపోయాననే విషయం మాత్రం ఇంకా తెలియచేయలేదు. కానీ గతంలో ఈమె పైన ఎన్నో రూమర్లు కూడా వినిపించాయి. కానీ 20 ఏళ్లకే ఆ చేదు అనుభవం ఎదురయ్యేసరికి ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదని.. తన పెళ్లి విషయంలో కూడా తనకు ఆసక్తి లేదని.. ముఖ్యంగా వివాహం చేసుకున్న ఆడవాళ్లు ఆనందంగా లేరని తన పర్సనల్ అభిప్రాయంగా తెలియజేస్తోంది ఆండ్రియా. ఆండ్రియా నటిస్తున్న చిత్రాలలో పిశాచి-2, కా, నో ఎంట్రీ తదితర సినిమాలు ఉన్నాయట. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version