పేకాట దగ్గర సెల్ఫీ తీసుకున్నాడని పీక పిసికి చంపేశారు

-

పేకాట నిర్వాహకుల చేతిలో గిరిజన యువకుడు హత్యకు గురైన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. జి.మాడుగుల మండలం మంజరి పంచాయతీ గొందిమెలక వద్ద జరుగుతున్న కోడిపందాలు, పేకాట, చిత్తులాట వద్దకు అతను వెళ్ళాడు. జూదం ప్రాంగణం నుండి సారె సుభాన్ అనే యువకుడు మధ్యాహ్నం 4 గంటలకు మొబైల్ ఫోన్ ద్వారా సెల్ఫి తీసుకున్నాడు. కోడిపందాలు, పేకాట, జూదం నిర్వాహకులు వెంటనే సారె సుభాన్ పీక నులిమి హత్య చేసారు.

అక్కడే ఉన్న సుభాన్ సన్నిహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. జి. మాడుగుల పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా… ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు ఎస్సై. డిగ్రీ చదివి ఇంటికి పెద్దదిక్కుగా నిలుస్తాడనుకున్న ఒక్కగానొక్క కుమారుడు ఇలా చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version