ఐదు వేరియంట్లలో లాంచ్‌ అయిన iQoo Neo 7 SE

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త ఫోన్ ఐకూ తన కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నియో 7 ఎస్ఈని విడుదల చేసింది. ఇది ప్రస్తుతానికి చైనాలో లాంచ్‌ అయింది. త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్‌ కానుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో వచ్చిన ఐకూ నియో 7కు తర్వాతి వెర్షన్‌గా దీన్ని విడుదల చేశారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

iQoo Neo 7 SE ధర..

ఈ ఫోన్‌లో ఐదు వేరియంట్లలో లాంచ్‌ అయింది.. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,099 యువాన్లుగా అంటే సుమారు రూ.24,800గా నిర్ణయించారు.
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 2,299 యువాన్లుగానూ సుమారు రూ.27,100, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగానూ అంటే సుమారు రూ.29,500 ఉంది.
టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా సుమారు రూ.33,100గా నిర్ణయించారు.
12 జీబీ ర్యామ్ + 512 జీబీ వేరియంట్ కూడా ఉంది. దీని ధర 2,899 యువాన్లుగా అంటే రూ.34,300గా ఉంది.

iQoo Neo 7 SE స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ప్యానెల్‌ను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
ఏకంగా 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ అందించనుండటం విశేషం.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
16 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. 512 జీబీ వరకు స్టోరేజ్ కూడా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఐకూ నియో 7 ఎస్ఈ సపోర్ట్ చేయనుంది.
కేవలం 10 నిమిషాల్లోనే 60 శాతం చార్జింగ్ ఈ ఫోన్ ఎక్కనుందని కంపెనీ తెలిపింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఒకవేళ మనదేశంలో ఈ ఫోన్‌ లాంచ్ అయితే శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీకి ఇది ప్రధాన పోటీదారు కానుందని టెక్కీస్‌ అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version