తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన అనతి కాలంలోనే సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో ఇంత సక్సెస్ అవుతున్నాడు అంటే దానికి కారణం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ అని చెప్పవచ్చు. ఈమె మహేష్ బాబును వివాహం చేసుకున్న దగ్గర నుంచి నేటి వరకు ఒక భార్యగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ వస్తోంది. మహేష్ బాబుకు కథల ఎంపిక విషయం దగ్గర నుంచి ఆయన వేసుకునే డ్రెస్సుల వరకు ప్రతి దాంట్లో కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.
అంతేకాదు నమ్రత చూసుకుంటుంది అన్న నమ్మకంతో రెస్టారెంట్లు కూడా ఓపెన్ చేశారు. ఇటీవలే తన భార్య నమ్రత పేరు మీద ఏ ఎన్ రెస్టారెంట్ ను మహేష్ బాబు ఓపెన్ చేయగా ఊహించని స్థాయిలో ఈ రెస్టారెంట్ కు విశేష స్పందన లభిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని నమ్రత ఇటీవల ఒక జర్నలిస్టుతో స్పెషల్ చిట్ చాట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో విషయాలను పంచుకుంది. మహేష్ బాబు నటించిన చిత్రాలలో తనకు పోకిరి సినిమా అంటే చాలా ఇష్టమని.. అయితే తనకు నచ్చని సినిమా ఏదైనా ఉంది అంటే అది వంశీ మాత్రమే అని తెలిపింది.
ఇక మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ లో బుల్లెట్ దిగిందా? లేదా ? అనే డైలాగు తనకు చాలా ఇష్టమని నమ్రత వెల్లడించింది. మరి వంశీ సినిమాలో నమ్రత హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఇక్కడి నుంచి వీరి ప్రేమ ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు.