ప్రపంచ కుబేరుల జాబితా విడుదల.. మళ్లీ ఆయనకే ఫస్ట్ ప్లేస్

-

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మళ్లీ ఫస్ట్ ప్లేస్ కి చేరుకున్నారు.బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. 208 బిలియన్‌ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానానికి చేరుకున్నారు. 205 బిలియన్‌ డాలర్లతో జెఫ్‌ బెజోస్‌, 199 బిలియన్‌ డాలర్లతో ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. చాలా కాలం నుంచి ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా టెస్లా షేర్లు రాణించడంతో మస్క్‌ తిరిగి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.

ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో ఎలాన్ మస్క్‌ కు 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు. దీంతో టెస్లా షేర్లు రాణించాయి. పే ప్యాకేజీపై పోరాటం, ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికలు, టెక్-స్టాక్ ర్యాలీ కారణంగా మస్క్‌ సంపద గణనీయంగా బాగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్ వెల్త్‌ ఇండెక్స్‌ ప్రకారం ఎలాన్ మస్క్‌కు కంపెనీలో 65శాతం వాటా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version