రోడ్డుమీద స్కూటర్ పేలడంతో అక్కడికక్కడే ప్రయాణికులు మరణించారనే ఒక వార్త వచ్చింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయిపోతోంది. ఎలక్ట్రికల్ స్కూటర్ పేలిందని అందులో ఉంది. అయితే నిజంగా ఎలక్ట్రికల్ స్కూటర్ పేలిపోయింది..? బెంగళూరు రూరల్ లోని భట్టారా గ్రామంలో ఎలక్ట్రికల్ స్కూటర్ పేలిపోయిందని… స్కూటర్ నడుపుతున్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం.
బెంగళూరులో భట్టారా గ్రామం క్రాస్ ఆర్ టి ఓ కార్యాలయం సమీపంలో ఓకే ఎలక్ట్రికల్ బైక్ పేలిపోయి.. నడుపుతున్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు అంటూ వాట్సాప్ లో విపరీతంగా వీడియో వైరల్ అవుతోంది. అయితే ఎలక్ట్రికల్ స్కూటర్ పేలిపోయింది అనేది నిజం. అయితే బెంగళూరు రూరల్ లో ఈ సంఘటన జరిగింది అన్న వాదన ఫేక్ అని స్పష్టం గా తెలుస్తోంది.
సమాచారం :-
బెంగళూరు గ్రామీణ ప్రాంతం, భట్టారా గ్రామం క్రాస్, ఆర్. టి. ఓహ్ కార్యాలయం సమీపంలోని రోడ్డుపై ఎలక్ట్రిక్ బైక్ పగిలిపోయి రైడర్ సజీవదహనమయ్యాడు. pic.twitter.com/EqkrYbL8uq
— #Bose DK WhoKilledBabai (@micky_4645) November 13, 2021
పుదుచ్చేరి మరియు తమిళనాడులోని విల్లుపురం జిల్లాల మధ్య ప్రాంతంలో స్కూటర్ పై తీసుకెళ్తున్న క్రాకర్స్ బ్యాగ్ పేలిపోయింది. దీనితో ఒక వ్యక్తి మరియు అతని కుమారుడు మరణించారు. అయితే బాణసంచా పేలడమే దీనంతటికీ కారణమని తెలుస్తోంది. బ్యాగ్ లోని క్రాకర్స్ వేడెక్కడం వల్ల మంటలు చెలరేగడంతో పేలుడు జరిగిందని తెలుస్తోంది. అయితే ఎలక్ట్రికల్ స్కూటర్ పేలి చనిపోయారు అనేది తప్పు. కనుక ఎలక్ట్రికల్ బైక్ పేలి చనిపోయారన్న వార్తలో నిజం లేదు.