పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ నుంచి తనకు ఇంకా నోటీసులు అందలేదని, అందినప్పుడు మాట్లాడుతానని ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన దానం.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తానని తెలిపారు. తాను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదని, హైడ్రా అధికారుల విషయంలో ఇప్పటికీ కాంప్రమైజ్ కాలేదని, అవ్వను కూడా అని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ పాలనలో సైతం అధికారుల విషయంలో తాను వెనక్కి తగ్గలేదని, పోతే పోతా జైలుకు.. నాపై 173 కేసులు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు. పేదల ఇళ్లు కూలుస్తానంటే మాత్రం ఊరుకునేది లేదని వెల్లడించారు. తన ఇంట్లో మాజీ సీఎంలు వైఎస్సార్, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని.. అభిమాన నేతల ఫోటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.