బీఆర్ఎస్ కార్యకర్తను కారులో ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే?

-

తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకు రాచమర్యాదలు చేస్తున్న పోలీసులు ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నాయి. తాజాగా భువనగిరిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఓ బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు కారులో ఈడ్చుకుంటూ వెళ్లారు.

యాదాద్రి -భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మీద దాడికి నిరసనగా వినాయక చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న వల్లపు విజయ్ ముదిరాజ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్తున్న విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version