న‌న్ను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని నిర్మాత‌లు ఒత్తిడి చేశారుః తాప్సీ

-

తాప్సీ taapsee అంటే ఒడిదుడుకుల‌కు మారుపేరుగా చెప్పాలి. ఎందుకంటే ఈమెకు మొద‌ట్లో బాగానే ఆఫ‌ర్లు వ‌చ్చినా.. ఆ త‌ర్వాత ఆమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు. వ‌చ్చినా అవ్వి సెకండ్ హీరోయిన్‌గానే వ‌చ్చాయి. దీంతో ఆమె నిరాశ ప‌డ‌కుండా సిన్సియ‌ర్‌గా బాలీవుడ్‌లో ట్రై చేసి పెద్ద ఆఫ‌ర్ల‌ను కొట్టేసింది. ఇప్ప‌టికే చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తాప్సీ /taapsee

అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ తన కెరీర్ ఆరంభంలో త‌నుకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను వివ‌రించింది. తాప్సీకి ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చినా చివ‌ర‌కు అవి చేజారిపోయేవి. ఇక అలాంటి స‌మ‌యంలోనే త‌న‌కు పతి పత్ని ఔర్ ఓ అనే మూవీలో ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ చివ‌ర‌కు మరో హీరోయిన్ ను తీసుకుని నిర్మాత‌లు షాక్ ఇచ్చారు.

అయితే ఈ విష‌యాన్ని కూడా త‌న‌కు చివ‌రిదాకా చెప్పకుండా తీసేసార‌ని, క‌నీసం చెప్పి తీసేస్తే బాగుండేద‌ని వివ‌రించింది. క‌నీసం త‌న‌కు సమాచారం ఇవ్వకుండా తీసేసార‌ని ఆవేద‌న వ్యక్తం చేసింది. ఇక అదే క్ర‌మంలో త‌న‌నే మీడియా ముందుకు వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని నిర్మాతలు త‌న‌ను పిలిచి ఒత్తిడి చేశార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. నిర్మాత‌లు తప్పు చేసి త‌న‌ను క్షమాపణ చెప్పమన‌డం బాధ‌పెట్టింద‌ని తాప్సీ వెల్ల‌డించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version