మన జీవితాన్ని తీర్చి దిదే గురువులకు కృతజ్ఞతలు చెప్పే రోజు టీచర్స్ డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఈరోజు మన దేశ మాజీ రాష్ట్రపతి గొప్పతత్వవేత్త, ఉపాధ్యాయుడు అయినా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఆయన గౌరవార్థం ఈరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజు కేవలం ఆయన పుట్టిన రోజు మాత్రమే కాదు, గురువుల త్యాగం, కృషి మార్గదర్శకత్వాన్ని స్మరించుకునే ఒక ముఖ్యమైన రోజు.
గురువుల ప్రాముఖ్యత: గురువులు మనకు కేవలం చదువు చెప్పేవారు మాత్రమే కాదు, జీవితంలో సరైన మార్గాన్ని చూపించేవారు తల్లిదండ్రుల తర్వాత మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎంతో గొప్పది. గురువులు లేనిదే సమాజం అభివృద్ధి చెందదు. వారు జ్ఞానాన్ని పంచి విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మారుస్తారు.

డాక్టర్ రాధాకృష్ణన్ గారికి నివాళి : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఆయన రాష్ట్రపతి అయిన తరువాత ఆయన పుట్టిన రోజును జరుపుకోవడానికి, విద్యార్థులు వచ్చినప్పుడు ఆయన తన పుట్టినరోజును వ్యక్తిగతంగా జరుపుకోవడం కంటే దేశంలోని ఉపాధ్యాయులు అందరికీ గౌరవంగా ‘ఉపాధ్యాయ దినోత్సవం’ గా జరుపుకుంటే చాలా సంతోషిస్తానని చెప్పారు. అప్పటినుండి సెప్టెంబర్ ఐదున మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఉపాధ్యాయ దినోత్సవం మన జీవితంలో గురువుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే రోజు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నివాళిగా వారి జ్ఞాపకార్థం ఈ రోజున జరుపుకుంటాం. జ్ఞానం పంచే గురువులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారి కృషిని గుర్తించేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరి మీ జీవితంలో మీకు నచ్చిన గురువులకు కృతజ్ఞతలు తెలపండి.
ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ గురువులను కలిసి లేదా వారికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పండి వారిని గౌరవించడం మనందరి బాధ్యత.