అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం…!

-

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించారని స్థానిక పోలీసులు మీడియాకు చెప్పారు. ఈ ఘటనలో ఎంత మంది గాయపడ్డారో  ఇంకా స్పష్టత రాలేదు. గాయపడిన వారికి సాధ్యమైనంత వేగంగా సహాయం అందించాలని, వారికి ముందస్తు చికిత్స అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ 730 వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో రోడ్‌ వేస్ బస్సు డ్రైవర్ కూడా మరణించాడు. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులలో చేర్పించారని, తీవ్ర గాయాలు అయిన వారిని… బరేలీ, లక్నోలోని ఆసుపత్రులకు పంపించామని డిఎం పిలిభిత్ తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version