పవన్,నా మధ్య వచ్చే సీన్లు మరోస్థాయిలో ఉంటాయి : ఇమ్రాన్ హష్మీ

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓ జి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదని చెప్పాలి.

తాజాగా OG మూవీపై బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పవర్ స్టార్ నాపై వేర్వేరుగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. మా ఇద్దరి కాంబినేషన్లో షూటింగ్ జరగాల్సి ఉంది. ఆ సీన్లు మరోస్థాయిలో ఉంటాయి అని తెలిపారు. తొలుత మూవీ రిలీజ్ ను సెప్టెంబర్కు ప్లాన్ చేయగా, ఇప్పుడు నిర్మాతలు కొత్త డేట్ కోసం చూస్తున్నారు’ అని తెలిపారు.ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version