సెక్స్ గురించి ఆయుర్వేదం చెప్పిన రహస్యాలు?

-

సెక్స్ గురించి ప్రతిదీ ఆసక్తిగా ఉంటుంది.. అందుకే ఎవరైనా చెబితే విని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.ఆయుర్వేదం ప్రకారం కొన్ని పాటించడం వల్ల.. మనం శృంగారాన్ని మరింత ఎక్కువగా ఆస్వాదించవచ్చట..

ఆయుర్వేదంలో, జీవితానికి మద్దతు ఇచ్చే మూడు స్తంభాలలో సెక్స్ ఒకటి. పురాతన భారతీయ వైద్య విధానం ప్రకారం, ఆరోగ్యకరమైన, నియంత్రిత లైంగిక సంపర్కంలో పాల్గొనడం వల్ల ఈ క్రింది ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి..వృద్ధాప్యం తొందరగా రాదు,జ్ఞాపకశక్తి పెరుగుతుంది.మేధో సామర్థ్యాలు పెరుగుతాయి..చలి ఎక్కువగా ఉండే నెలల్లో శృంగారంలో పాల్గొంటే తృప్తి ఎక్కువగా లభిస్తుంది. వేసవికాలంలో మాత్రం కాస్త ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదట.

సెక్స్ తర్వాత, స్నానం చేయండి. ఆ తర్వాత పాలు లేదా చక్కెరతో చేసిన స్వీట్లను తినండి..చల్లటి నీరు, మాంసం సూప్, పచ్చి శెనగ సూప్ లేదా పాలు తాగడాన్ని కూడా పరిగణించవచ్చు.. శక్తిని తిరిగి పొందడానికి కాసేపు నిద్రపోవడం కూడా ఉత్తమమైన మార్గం.మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. అందుకోసం యోగా చెయ్యొచ్చు. యోగా వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఒత్తిడిని దూరం చేసి రోజంతా మిమ్మల్ని రిలాక్స్‌గా ఉండేలా చేస్తాయి. ఏకాగ్రత కూడా లభిస్తుంది. యోగా మీ ఇంద్రియ, మానసిక, శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. యోగా ఆరోగ్యానికే కాదు.. శృంగారానికి కూడా ఎంతో మేలు చేస్తుంది

లైంగిక ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటి?
ఆరోగ్యకరమైన లైంగిక కార్యకలాపాలకు ఫిట్‌గా ఉండే శరీరం, మనస్సు తప్పనిసరి. కాబట్టి, లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సరైన ఆహారాన్ని తినమని సలహా ఇస్తారు. కొన్ని ఉత్తమ ఆహారాలు:
నెయ్యి,ముడి బియ్యం, సీతాఫలం,పాలు,బాదం,బాదం పాలు

Read more RELATED
Recommended to you

Exit mobile version