కొంపముంచిన కాంగ్రెస్ సోషల్ మీడియా పోల్.. మన్నే సతీశ్ కుమార్ ఔట్?

-

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో గత బీఆర్ఎస్ సర్కారు పాలన బాగుందని 75 శాతం మంది పోలింగ్ ‌లో పాల్గొని ఓట్లేశారు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలనకు 25 శాతమే ఓట్లు పోలయ్యాయి.ఈ ఓటింగ్ అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహించడంతో పార్టీ, ప్రభుత్వం పరువు రెండూ పోయాయని పార్టీలో అంతర్గత చర్చ జరిగింది.

దీనిపై సీఎం రేవంత్ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. పోల్ ఎందుకు నిర్వహించారని ఫైర్ అవ్వడమే కాకుండా అందుకు బాధ్యుడిగా చేరుస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్,టీఎస్టీఎస్ చైర్మన్ రెండు పదవుల నుండి మన్నే సతీష్ కుమార్‌ను తొలగించనున్నట్లు తెలుస్తోంది.మన్నే సతీష్ స్థానంలో గుత్తా అమిత్ లేదా పెద్దపల్లి ఎంపీ వంశీని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news