ఆస్తి కోసం కన్న కొడుకు కిరాతకుడుగా మారాడు.నవమాసాలు మోసి కని పెంచిన తల్లిపై కక్ష పెంచుకున్నాడు. ఆస్తి రాసిస్తావా లేదా అని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కోపోద్రిక్తుడై క్షణికావేశంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
ఈ ఘటన రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.ఆస్తి కోసం కొడుకు తల్లిపై దారుణంగా దాడి చేసిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లోని ఫ్లోర్ అంతా రక్తపు మరకలు దర్శనమిచ్చాయి. తల్లి వీపులో కత్తితో బలంగా గుచ్చగా.. తీవ్రగాయమై రక్తస్రావం జరిగి ఆ తల్లి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.