ఫ్యాక్ట్ చెక్: ఇండోనేషియా సముద్రంలో దొరికిన విగ్రహాలు 5000 సంవత్సరాలు నాటివి కావు..!

-

తాజాగా నెట్టింట్లో ఒక వార్త షికార్లు కొడుతోంది. ఇండోనేషియా సముద్రంలో దొరికిన హిందువుల దేవుడి విగ్రహాలు 5000 సంవత్సరాల క్రితం నాటివని వార్త వచ్చింది. అయితే దీనిలో నిజమెంత అనేది ఇప్పుడు చూస్తే…

నీటి లోపల కొన్ని విగ్రహాలు ఉండే ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి పోతోంది. ఇండోనేషియా బాలి లో దొరికిన ఈ విగ్రహాలు ఐదువేల సంవత్సరాల నాటివని అంటున్నారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో ఈ ఫోటోలను పెట్టి ఐదు వేల సంవత్సరాల నాటి శ్రీ విష్ణు మూర్తి బాలి సముద్రం ఇండోనేషియాలో దొరికారు అని అంటున్నారు.

అయితే దీనిలో ఏ మాత్రం నిజం లేదని తాజాగా తేలింది. అయితే ఐదు వేల సంవత్సరాల నాటి విగ్రహాలు ఇవి కాదని 2005 లో క్యూబా డైవర్స్ ఈ విగ్రహాలని క్రియేట్ చేశారని తెలుస్తోంది. వీటిని రాయితో తయారు చేశారని.. అండర్ వాటర్ గార్డెన్ క్రియేట్ చేయడానికి వీటిని రూపొందించారని తెలుస్తోంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడో పూర్వం నాటివి అని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ లో అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్ అని చాలా మంది బ్లాగర్లు వీటిని పోస్ట్ చేశారు. దీని ఆధారంగా కూడా మనం ఇవి వాటర్ గార్డెన్లోవి అని తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version