ఇవాళ ఛలో రాజ్ భవన్ కు తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఫోన్ ట్యాప్ కి నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో భాగంగా… ఇందిరాపార్కు నుండి.. రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో పోలీసులకు మరియు కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులపై సీరియస్ అయ్యారు.
రాజ్ భవన్ పోదాం అంటే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని.. పోలీసులకు మజాక్ అయ్యిందని ఫైర్ అయ్యారు. మా ఓపిక నశించే వరకు చూడొద్దని…మా విశ్వరూపం చూపించాల్సి ఉంటదని హెచ్చరించారు జగ్గారెడ్డి. మీటింగులు పెట్టీ స్పీచ్ లు ఇవ్వడం బందు పెట్టాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని… మేము అధికారం లో ఉన్నప్పుడు మాకు సెల్యూట్ చేసిన వాళ్ళే మీరు అని గుర్తు చేశారు. మేము అధికారం లోకి వచ్చిన తర్వాత మళ్లీ సెల్యూట్ కొట్టాల్సిందేనని..జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడు అనుమతి ఇవ్వాలని.. లేదంటే… నెక్ట్స్ టైం పోలీసులతో యుద్ధమేనన్నారు.