ఈ వయస్సులో కూడా తగ్గేదేలే అంటున్న తాత..సైకిల్ పై అమ్ముతూ..

-

ఒకప్పుడు మనుషులు ఎటువంటి అనారొగ్య సమస్యలు రాకుండా వందేళ్లు బ్రతికేవారు..వాళ్ళ తిండి,పని అలా ఉండేది.. అందుకే ఆ రోజుల్లో వందేళ్లు పూర్తి చేసుకున్నా నిత్య పెళ్లి కొడుకు మాదిరి చాలా స్ట్రాంగ్గా,ఏళ్లకు ఏళ్ళు జీవించే వాళ్ళు..కానీ రోజులు మారే కొద్ది మన ఆయుస్షును మనమే తీసుకుంటున్నాము..కొత్త రుచుల పేరుతో ఆరొగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాము..వందేళ్లు బ్రతకాల్సిన వాళ్ళు 60 ఏళ్ళకే చనిపొతున్నారు..
ఈరోజుల్లో 50 ఏళ్లు పైబడిన వారంతా కూడా రెస్ట్ పేరుతో ఇంటికే పరిమితం అయ్యారు..అలాంటి ఈ రోజుల్లో కొంతమంది సహాసాలు చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు..తాజాగా ఓ 87 ఏళ్ల తాత అందరికి ఆదర్సంగా నిలిచారు.. ఆయన జీవిత విశేషాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

విజిల్‌ తాత అసలు పేరు బాబు, ఆయనకు భార్య ఫాతిమా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. పిల్లలంతా వేర్వేరుప్రాంతాల్లో చక్కగా స్థిరపడ్డారు. తాత మాత్రం 30 ఏళ్లుగా ఇదే సైకిల్‌పై టీ, తినుబండారాలు విక్రయిస్తూ కాలం గడుపుతున్నారు..వేకువజామున 5 గంటలు మొదలు రాత్రి 8 గంటల వరకు సైకిల్‌పై హుషారుగా తిరుగుతూ అల్లం టీ, తినుబండారాలు అమ్ముతుంటాడు.విజిల్‌ ఊదుకుంటూ వీధివీధి తిరుగుతుంటారు. తాత విజిల్‌ వింటే చాలు ఎంతోమంది గ్లాసులు, ఫ్లాస్కులు తీసుకుని ఆయన సైకిల్‌ వద్దకు పరిగెత్తుతారంటే నమ్మగలరా.. కానీ నమ్మాలి.. అంత బాగుంటుంది ఆయన టీ..

ఈ వయస్సులో ఎందుకు అని బిడ్డలు ఎంత చెప్పిన వినకుండా తన పని తాను చేసుకుంటూ వస్తున్నారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, మార్కెట్‌.. ఇలా వరుసగా అన్ని ప్రాంతాలు కలియతిరుగుతూ టీ విక్రయిస్తాడు. ఈ వయసులో కూడా కుర్రాళ్లకు దీటుగా తిరుగాడుతున్న విజిల్‌ తాతను ఎంతోమంది మెచ్చుకుంటున్నారు..అతని టీకి డిమాండ్ కూడా ఎక్కువే అందుకే మంచి లాభాలను కూడా అందుకుంటున్నారు..మొత్తానికి నేటి యువతకు ఆయన ఒక దిక్సూచిగా మారాడు..హ్యాట్సాప్ తాత..

Read more RELATED
Recommended to you

Exit mobile version