ఎండలు మొదలయ్యాయి.. వేసవిలో ఆరోగ్యంగా ఉండేదుకు ఈ 8 టిప్స్ పాటించండి..!

-

ఇక వేసవి కాలం మొదలైపోయింది వేసవికాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎండల వలన ఎక్కువ చెమట పట్టడం శరీరంలో నీళ్ళని ఎక్కువగా కోల్పోవడం తో వివిధ రకాల సమస్యలు కలుగుతాయి. వేసవి కాలంలో ఆహార విషయంలో పలు నియమాలని అనుసరించాలి. లేకపోతే వేసవికాలంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు పలు చిట్కాలని చెప్పారు వాటి కోసమే ఇప్పుడు చూసేద్దాం.

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అనుసరించండి:

వేసవికాలంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండండి.
అలానే హైడ్రాయిడ్ గా ఉండడానికి ఎక్కువ ఫ్లూయిడ్స్ ని తీసుకుంటూ ఉండండి పండ్ల రసాలు వంటి వాటిని తరచూ తీసుకుంటూ ఉండండి.వేసవిలో దొరికే పండ్లు, కూరగాయలని డైట్ లో తీసుకుంటూ ఉండండి వీటివలన ఆరోగ్యం బాగుంటుంది. పైగా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. పుచ్చకాయ, కీరదోస, టమాటా, చెర్రీస్, పీచ్ మొదలైనవి తీసుకుంటూ ఉండండి.
చర్మాని ప్రొటెక్ట్ చేసుకోండి. బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం. క్యాప్ సన్ గ్లాసెస్ వంటివి ధరించడం వంటివి మర్చిపోకండి.

వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి. పిల్లలు పెద్దలు కూడా వేసవిలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి వాటి నుండి దూరంగా ఉండాలి స్విమ్మింగ్ వంటి వాటిని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలానే పిల్లలకి వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలి.
దోమలు వంటి వాటితో జాగ్రత్తగా ఉండండి వేసవిలో చాలామంది అవుట్డోర్ ఆక్టివిటీస్ కి వెళ్తూ ఉంటారు ఇటువంటప్పుడు దోమలు వంటివి కుడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
అలానే ఎండలో బయటకి వెళ్ళకండి. సాయంత్రం పూట మీ పనులు చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version