గంట ముందు ఇంటికెళ్లిందని విద్యార్థిని చేయి విరగ్గొట్టిన టీచర్

-

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులు ఇటీవలి రోజుల్లో సహనం కోల్పోతున్నారు. ఆవేశంలో వారు తీసుకునే నిర్ణయాలు అటు విద్యార్థులకు చేటు చేయడంతో పాటు వారికి, తోటి టీచర్లకు కూడా చెడు పేరును తీసుకొస్తుంది. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిని చేయి విరగ్గొట్టిన ఘటన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే..దుబ్బకు చెందిన అశ్విత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే, అశ్విత ఓ రోజు పాఠశాల ముగిసే టైం కంటే గంట ముందుగానే ఇంటికి వెళ్లింది.మరుసటి రోజు స్కూల్‌కు వెళ్లిన సదరు విద్యార్థినిపై ఆగ్రహించిన క్లాస్ టీచర్ ఆమెను విచక్షణా రహితంగా కర్రతో బాదింది.దీంతో అశ్విత కుడి చేయి విరిగింది. విషయం తెలియడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version