గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 432 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 15 వ ఆర్థిక సంఘం… రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల అయ్యాయి.
తాజాగా విడుదలైన నిధుల లెక్కల ప్రకారం… గ్రామ పంచాయతీలకు ఎక్కువ మొత్తంలో నిధులు రాగా మండల పరిషత్ మరియు జిల్లా పరిస్థితులకు తక్కువ నిధులు వచ్చాయి. గ్రామ పంచాయ తీలకు రూ. 182. 49 కోట్లు విడుదల కాగా మండల పరిషత్ లకు రూ. 124. 11 కోట్లు మరియు జిల్లా పరిస్థితులకు రూ. 125. 95 కోట్లు విడుదల అయ్యాయి. ఇక ఈ విడుదలైన నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు అధికారులు. కాగా గ్రామీణ మరియు పట్టనాల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.