నాన్న లేడు, అమ్మ లేదు… కొడుకు లేదు కూతురు లేదు… నేనే… నేను మాత్రమే. ప్రపంచానికి కరోనా నేర్పిన మానవత్వం లేని విధానం ఇది. కళ్ళ ముందు మనతో తిరిగిన సాటి మనిషి చచ్చిపోతున్నా సరే అమ్మో నేను అంటూ భయపడుతూ దూరంగా ఉంటున్నారు. ఎన్ని విధాలుగా కరోనా విషయంలో అవగాహన కల్పించినా సరే మనుషుల్లో మార్పు రావడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాల్లో ఒక ఘటన జరిగింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మానవత్వాన్ని మరిపించే ఘటన జరిగింది. క్యాజువాలిటీ ముందు మహిళ మృతదేహాన్ని వదిలి వెళ్ళిపోయారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉంది మృతదేహం. వర్షంలో కూడా తడిచిపోయింది. రెండు గంటల పాటు వర్షంలోనే ఉంది. ఫోన్ లు చేసినా సరే ఎవరూ స్పందించలేదు. దీనితో మున్సిపాలిటీ వారికి సమాచారం ఇవ్వడంతో వారే వచ్చి దహన సంస్కారాలు చేసారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది.