పుష్ప-2 మూవీ మధ్యలో ఆడియెన్స్‌పై పెప్పర్ స్ప్రే కొట్టిన యువకుడు..ఎక్కడంటే?

-

అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప-2 ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.తొలి రోజే ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో కాసుల వర్షం కురుస్తోంది.దీంతో అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు.సినియాలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక హైదరాబాద్‌లో మూవీ రిలీజ్ సందర్భంగా చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

pushpa

ఈ క్రమంలోనే ముంబై గెలాక్సీ థియేటర్‌లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రేక్షకులు మూవీ చూస్తుండగా ఒక్కసారిగా పెప్పర్ స్ప్రేను ఆడియన్స్‌పై చల్లారు. దీంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరగుతుందో అర్ధం కాక చాలా మంది షాక్‌లో ఉండిపోయారు. మంట భరించలేక థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ యువకుడిని కొందరు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి విచారిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news